చింతమనేని వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ..స్పందించారు. ముందు వాడి ఊరిలో వాడిని చూసుకోమనండి..అడుగు జారిన ఎదవలంతా నానికి, నాకు చెబుతున్నారు.. మంగమ్మ శపథాలు చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి, నలుగురు విభేదించిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా లేక 150 మంది గెలిచిన పార్టీ వెంటిలేటర్ పైన ఉందో చెప్పాలన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
పోయే కాలం వచ్చిన వాళ్లు పోయారు… వీళ్లు పోయారు అంటూ అరుస్తుంటారన్నారు. 74 ఏళ్లు వచ్చిన చంద్రబాబు కు పరిణితి రాలేదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు.. వాళ్లను చూసి ఆ పార్టీ నాయకులంతా మాట్లాడతారని ఫైర్ అయ్యారు. గన్నవరం లో చంద్రబాబు గానీ లోకేష్ గానీ పోటీ చేయమని నేను చాలా సార్లు డైరక్ట్ గా చెప్పానని సవాల్ చేశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. కాగా..గన్నవరంలో జరిగిన చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకల్లో సంచలన కామెంట్లు చేశారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. గన్నవరం టీడీపీ ఇన్ ఛార్జిగా సమర్థులైన వారిని చంద్రబాబు నియమిస్తారు..ఎవరు ఆందోళన చెందనవసరం లేదన్నారు. ఇప్పటికే 150 కోట్లు ఖర్చు చేస్తానంటూ నా దగ్గరకు ఒక్కరు వచ్చారు.. వంశీని ఓడించాలని కోరారు.