శుక్రవారం నాడే సినిమాలు ఎందుకు రిలీజ్ అవుతూ ఉంటాయి..? కారణం ఏంటి..?

-

మనం గమనించినట్లయితే కొత్త సినిమాలు ఎప్పుడు కూడా శుక్రవారం నాడే రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా కేవలం శుక్రవారం నాడే ఎక్కువగా సినిమాలను రిలీజ్ చేస్తారు అందుకు కారణం ఏంటి..? ఈ సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది మరి ఇప్పుడే దీని వెనుక రీజన్ ని తెలుసుకుందాం..

వారంలో ఏడు రోజులు ఉంటాయి కానీ ఎక్కువ శుక్రవారం నాడే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దాని వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముందుగా మొదటి కారణం ని చూస్తే శనివారం ఆదివారం అందరికీ సెలవు ఉంటుంది. దీంతో ఎక్కువమంది మూవీస్ ని చూడడానికి థియేటర్ కి వెళ్తారు. ఒకవేళ శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ అయితే శనివారం ఆదివారం ఎక్కువ మంది సినిమాలను చూడడానికి వెళ్తారు అందుకని శుక్రవారం నాడు సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు.

అలానే శుక్రవారం సెంటిమెంట్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు శుక్రవారం నాడు మూవీస్ రిలీజ్ అయితే కనుక లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. ప్రొడ్యూసర్లు ఈ కారణంగా కూడా ఎక్కువగా మూవీస్ ని శుక్రవారం నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా శుక్రవారం నాడు రిలీజ్ చేయడానికి ఇంకొక కారణం ఉంది ఇది వరకు వారానికి ఒకసారి జీతాన్ని ఇచ్చేవారు. శుక్రవారం నాడే అందరికీ జీతాలు ఇచ్చేవారు ఆ రోజు జీతం వస్తుంది కనుక థియేటర్లకి ఎక్కువ మంది వెళ్లేవారు.

Read more RELATED
Recommended to you

Latest news