నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..షెడ్యూల్ ఇదే

-

తెలంగాణలో పలు జాతీయ రాహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపలు చేసేందుకు నేడు రాష్ట్రానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ రానున్నారు. ఈ నేపథ్యంలో కేందమంత్రి నితిన్‌ గడ్కరీ 8 వేల కోట్ల వ్యయంతో 460 కిలోమీటర్ల పొడవు గల జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అయితే ఇందులో 2 జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. వీటితో పాటు 10 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేస్తారని తెలంగాణ బీజేపీ నాయకులు వెల్లడించారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ కింద 7 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వంని ఈ కార్యక్రమానికి సమయం ఇవ్వాలని… ప్రోగ్రాం ని ఫైనల్ చేయాలని గడ్కరీ కోరినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ప్రోగ్రాంని తానే ఫైనల్ చేసుకొని గడ్కరీ టైమ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే నితిన్‌ గడ్కరీ పర్యటనపై తెలంగాణ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా తెలంగాణ బీజేపీ నితిన్ గడ్కరీ రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version