రేపు మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన

-

రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంత వాసుల నిర్మాణాలు తొలగిస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
రేపు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మూసీ సుందరీకరణ
ప్రాజెక్టుతో తమ ఇండ్లు, దుకాణాలు కోల్పోయి నిర్వాసితులుగా మారనున్న బాధిత ప్రజలను కలిసి
వారి సమస్యలు తెలుసుకోనున్నారు. కిషన్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న 8 జిల్లాల పార్టీ
అధ్యక్షులతో, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, హైడ్రా,
ఆర్ఆర్ఆర్ పై నేతలతో కిషన్ రెడ్డి చర్చించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం
సరికాదన్నారు. పేదలను ఒప్పించి మాత్రమే ఖాళీ చేయించాలని, బలవంతంగా వారిని తరలించడం
సరికాదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ముందుగా కమర్షియల్ నిర్మాణాలను మాత్రమేమ కూల్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల వేలాది మంది పేదలు రోడ్డున పడే ప్రమాదం
ఏర్పడిందన్నారు. మూసీ బాధితులకు. బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరూ
భయపడాల్సిన పనిలేదని, నిర్వాసితులకు అండగా రేపట్నుంచే కొత్త కార్యచరణ అమలు
చేయబోతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news