మండిపోతున్న కూరగాయల ధరలు.. టమాటా రూ.100, మిర్చి రూ.80

-

సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఇంకా ధరలు మండుతూనే ఉన్నాయి. ప్రధానంగా పంటల సాగు ఆలస్యంతో ఈ పరిస్థితి నెలకొందని రైతులు, మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత, జూన్‌లో వర్షాభావ పరిస్థితులు కూరగాయల సాగుపై ప్రభావం చూపాయని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటా రూ.100, మిర్చి రూ.80, ఉల్లిగడ్డ రూ.60, ఆలుగడ్డలు రూ.50గా ఉన్నాయి.

ఏటా మే నుంచే కూరగాయల సాగు ప్రారంభమవుతుండగా.. ఈసారి తీవ్రమైన ఎండల వల్ల చెరువులు, కుంటలు ఎండిపోవడంతో మేలో కూరగాయల సాగుతగ్గింది. జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో సాగుపై ప్రభావం చూపింది. ఈ నెలలో ఓ మోస్తరు వర్షాలు పడుతుండడంతో పలు జిల్లాల్లో రైతులు ఇప్పుడిప్పుడే కూరగాయల సాగు చేపడుతున్నారు. గత మే నుంచి స్థానికంగా ఉత్పత్తులు లేక రోజూ 42 వేల టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ తదితర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి.  రవాణా భారం పెరగడం, కొరత దృష్ట్యా వ్యాపారులు ధరలు పెంచుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news