వైసీపీ కార్యకర్త హత్య.. పల్నాడు ఎస్పీ కీలక ప్రకటన..!

-

వైసీపీ కార్యకర్త హత్యపై.. పల్నాడు ఎస్పీ కీలక ప్రకటన చేశారు.వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పల్నాడు ఎస్పి శ్రీనివాస్ రావు తెలిపారు. మృతుడు రషీద్, నిందితుడు జిలానీ మధ్య కొంతకాలం నుంచి వివాదం ఉందని వెల్లడించారు. వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని ఎస్పీ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.

Palnadu SP Srinivas Rao

అయితే, వైసీపీ పార్టీ మాత్రం టీడీపీ ని టార్గెట్ చేస్తోంది. TDP రాక్షసానందానికి ఇంకెంత మంది బలి కావాలి ? అంటూ పల్నాడు హత్య పై వైసీపీ ఫైర్ అయింది. పల్నాడులో నరరూప రాక్షసుల్లా మారి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని టీడీపీ గూండా జిలానీ చంపేసాడని వైసీపీ ఆరోపణలు చేసింది. వినుకొండ వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం నాయకుడు రషీద్‌పై పాశవికంగా కత్తితో దాడి చేసాడని తెలిపింది వైసీపీ.

దారుణంగా రెండు చేతులు నరికి, మెడపై కూడా వేటు వేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రషీద్‌ మృతి చెందినట్లు తెలిపింది. మీ TDP వాళ్ల రాక్షసానందానికి ఇంకెంత మంది బలి అవ్వాలి హోం మంత్రి అనిత, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు దేశంలో మరీ ఇంత నీచమైన కక్ష సాధింపు రాజకీయాలు ఎవరైనా చేస్తారా ?అంటూ ట్వీట్ చేసింది వైసీపీ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news