కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి, బతుకమ్మ చీరలపై ప్రజలకు క్షమాపణలు చేయాల్సింది పోయి నేతన్నల పై మొసలి కన్నీరు కారుస్తున్నారు అని వేములవాడ MLA ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేటీఆర్ మాట్లాడే దురహంకార పొగరు మాటలను ప్రజలు చీత్కకరిస్తున్నా కూడా మారడం లేదు. బతుకమ్మ చీరలపై బిఆర్ఎస్ పెట్టి వెళ్లిన 197 కోట్ల రూపాయల బఖాయలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చింది. నీమీద కోపం ప్రజలను మభ్యపెట్టినందుకు, రాష్ట్రాన్ని అప్పుల కుపపగా మారచినందుకు కోపం. ముఖ్యమంత్రిని మరియు కాంగ్రెస్ నాయకులను నిందించండం మానుకోవాలి.
అలాగే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారచారు కాబట్టే ప్రజలు ఎంపీ ఎన్నికల్లో పక్కకు పెట్టారు. ఎనిమిది కోట్ల మీటర్లతో కోటి ముప్పై లక్షల చీరలను ఇచ్చే ప్రయత్నం చేస్తామని ప్రకటన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమై పోతుందనే ఈర్ష్య తో అబధ్ధాలు మాట్లాడుతున్నారు. మేము హైడ్రాతో హైడ్రామా చేయడంలేదు.ప్రభుత్వ భూములను కాపాడుతున్నాము. రాబోయే రోజులలో ప్రభుత్వానికి సంబంధించిన యూనిఫాం ఆర్డర్లను నేతన్నలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.