కొండా సురేఖ వ్యాఖ్యలపై పరోక్షంగా కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని.. మాట్లాడాలంటూ సెటైర్లు పేల్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కావడంతో.. కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు.
ఏదైనా మాట్లాడే ముందు మనిషి యొక్క రెండో ఆలోచన, విశ్లేషణ…..ఆ వ్యక్తికి నిజమైన స్నేహితమని శ్రీ ఏఎన్ఆర్ గారు చెప్పినట్లు చూసాను ఒక ఛానల్‌ల.. జీవితాన్ని చదివి చూసిన మహోన్నతుల మాటలు ఎన్నటికీ సమాజానికి కూడా సందేశాత్మకాలే అంటూ వ్యాఖ్యానించారు. శ్రీ అల్లు రామలింగయ్య గారు మాతో ఎప్పుడూ చెప్పే ఒక్క మాట కూడా ఇక్కడ ప్రస్తావించాలని గుర్తు చేశారు. మనం మాట్లాడిన మాటకు మనం బానిసలం, మాటలాడని మాటకు మనమే యజమానులం అని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి.