2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు… విజయశాంతి స్ట్రాంగ్‌ కౌంటర్‌ !

-

2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌… విజయశాంతి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. దళితులకు 3 ఎకరాలు, దళితబంధు, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఇంకా ఎన్నో లెక్కకు చెప్పలేనన్ని మోసపు హామీలల్ల 10 ఏండ్లు ప్రజలను మోసగించిన బీఆర్ఎస్ గత సర్కార్, ఇయ్యాల ఇచ్చిన హామీలు తెలంగాణలో అమలుచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏండ్ల కన్నా నిలవదు అని మాట్లాడటం కేవలం దుర్మార్గం… దురంహంకారం అని ఫైర్‌ అయ్యారు.

ప్రజలెందుకు అసలు తిరుగుబాటు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ గారు..? సమాధానం చెప్పడం తప్పక మీ బాధ్యత అన్నారు. కరెంటు బిల్లులు సోనియా గాంధీ గారికి పంపించమంటున్న కేటీఆర్ గారు కాళేశ్వరం దోపిడీ బిల్లులు కెసిఆర్ గారి ఇంటికి పంపాలని చెప్పాలని చురకలు అంటించారు.
ఖజానా మొత్తము దోచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిన విషయం పూర్తిగా తెలుసు కాబట్టే కాంగ్రెస్ గ్యారెంటీ లు అమలు జరగవని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు…కష్టమైనా కాంగ్రెస్ అన్ని హామీలు అమలు చేసి తీర్చుతుందన్నారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news