మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరువు తీసింది బీజేపీ విజయశాంతి. నిన్న జరిగిన కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారానికి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, విజయశాంతి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమానికి వచ్చిన ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చూసి కనీసం ప్రసంగం కూడా చేయకుండా మధ్యలోనే వెళ్లిపోయారు బీజేపీ నాయకురాలు విజయశాంతి.
ఇక దీనిపై స్పష్టం విజయశాంతి.. తన సోషల్ మీడియాలో వివరణ కూడా ఇచ్చారు. బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారని..అది, సరి కాదని తెలిపారు. కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చానని పేర్కొన్నారు. ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చిందంటూ కిరణ్ కుమార్ రెడ్డికి చురకలు అంటించారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే.
బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో
వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.అది, సరి కాదు.
కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని… pic.twitter.com/l22P9lvyxm
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 21, 2023