తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ తెలుగు రాష్ట్రాలకు నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పచ్చ జెండా ఊపింది. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 4.2 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. నీటి కోసం వచ్చిన ప్రతిపాదనలపై.. రెండు రాష్ట్రాల ఈఎన్సీలను కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సంప్రదించారు.
తాగు నీటి కోసం తెలంగాణ పది టీఎంసీలు, ఏపీ ఐదు టీఎంసీలు కోరాయి. అయితే.. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం ఉన్న నీటిని దృష్టిలో పెట్టుకుని.. అందుకు అనుగుణంగా బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. జులై తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీకి 4.20 టీఎంసీలు విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. సెప్టెంబర్ వరకు తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి తెలంగాణకు 8.50 టీఎంసీలు విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. వీలైనంత వరకు పవర్ హౌస్‌ల ద్వారానే నీరు విడుదల చేయాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.