బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ మార్చాల్సిందే – విజయశాంతి

-

బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ మార్చాల్సిందేనని బిజేపి నేత విజయశాంతి విమర్శలు చేశారు. మోడీ గారి ప్రభుత్వం తెచ్చిన మహిళాబిల్లు, జనగణన, డి లిమిటేషన్ అంశాల దృష్ట్యా 2028/29 కాలంలో కావచ్చు అన్నారు. కాబట్టి ఇప్పటికైతే మహిళలకు ఈ ఎన్నికలలో 2023/24
సీట్లలో ఇయ్యనవసరం లేదు అని రాజకీయ పార్టీలు అనుకోకుండా ఇప్పటినుండి రానున్న ప్రతి ఎన్నికలలోను ఆ మహిళా ప్రాధాన్యతా ప్రాతినిధ్యాన్ని సాధ్యమైనంత వరకు తమ వైపు నుండి చూపి నిజాయితీని నిరూపించుకుంటే, మహిళా బిల్లుకు నిజమైన విలువ ఇచ్చినట్లు సమాజం అభిప్రాయపడతదని చెప్పారు.

vijayashanthi on ts assembly elections
vijayashanthi on ts assembly elections

అట్లా అయినప్పుడే, తెలంగాణ ల ఇప్పటికే 100కు పైగా అసెంబ్లీ సీట్లు ప్రకటించిన బీఆర్‌ఎస్, అందులో 6 స్థానాలు కేవలం మహిళలకు ఇచ్చి, మహిళా రిజర్వేషన్ పై గొంతుపెట్టి, మోసపూరితంగా అరుస్తోందన్న అనుమానం తెలంగాణ మహిళలకు కలగదన్నారు. నిజంగా మహిళా రిజర్వేషన్ పై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తన చిత్తశుద్దిని ప్రకటించాలనుకుంటే సీట్ల కేటాయింపు విషయంలో పునసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయగలితే అప్పుడు అధికార పార్టీ నిర్ణయంతో తెలంగాణలోని ప్రతిపక్షాలపై ఒత్తిడి పెరిగి, ప్రధాన పార్టీలన్నీ కూడా అధిక శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సిన నిర్భంధం ఏర్పడుతుందన్నారు. ప్రధాని మోడీ గారు తెచ్చిన మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల కార్యాచరణ ఇప్పటి నుండి ప్రారంభమై సార్థకత సాధిస్తుందని చెప్పారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news