కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలనుందా ? – విజయశాంతి షాకింగ్‌ రియాక్షన్‌ !

-

కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలనుందని కొంత ప్రచారం చేస్తున్నారు. అయితే.. దీనిపై విజయశాంతి షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చారు. కేసీఆర్ గారిని కలిసి బయటకొస్తున్న కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్నెల్లకన్న ఉండదు మల్ల మేమే వస్తాం అని మాట్లాడుతున్నారు, వారితో కేసీఆర్ గారు అట్ల మాట్లాడిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.అధికార స్వార్ధం, అహంకారం, దోపిడి, దుర్మార్గ నియంతృత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్య పరిణామాలను సహజంగా వ్యతిరేకిస్తవి.. అంతే కాక, ఈ ఒకనాటి టీఆర్‌ఎస్‌కు 2014లో వచ్చినవి 63 స్థానాలు.

ఇప్పటి కాంగ్రెస్ కన్నా తక్కువ, ఆ టీఆర్ఎస్.. ఇప్పటి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించినప్పుడు, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నడవదు? అని ప్రశ్నించారు. అంటే, ఆ బీఆర్ఎస్ నేతల ప్రకటన వెనుక.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య హననానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరుగుతున్న ప్రయత్నానికి, ఆ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు, వారి వెనుకున్న కేసీఆర్ గారు తప్పక సమాధానం చెప్పి తీరాలి తెలంగాణ సమాజానికి…కేసీఆర్ గారూ.. మీ పార్టీ నేతలు చేసిన పై ప్రకటన తప్పు.. అని చెప్పండి.‌ మీపై ఆ బాధ్యత ఉన్నది, మీరు ప్రజాస్వామ్య వాది అయినట్లయితే…మీరు, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు.. అన్న సమస్యను తప్పించుకోనికి ఇట్ల చెప్పిస్తున్నారు.. అన్నది ఎందుకో నిజమని తెలుస్తున్నదన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news