చక్కెర ధరను అదుపు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం

-

దేశంలో చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్‌ ఉత్పత్తికి చెరకు రసం వాడకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలో చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు ఆదేశాలు జారీ చేస్తూ ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ చక్కెర మిల్లులకు, డిస్టిలరీలకు ఓ లేఖ రాసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతోపాటు ధరలను పెరగకుండా చూడాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

చెరకు ప్రధానంగా పండించే రాష్ట్రాల్లో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదు కావడంతోపాటు దిగుబడి కూడా తగ్గింది. అందువల్ల కొన్నిరోజుల నుంచి చక్కెర ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా చక్కెర నిల్వలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో తక్షణమే ఇథనాల్‌ తయారీకి చెరకు రసం, సుగర్‌ సిరప్‌ వాడకం నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. అయితే ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలకు బీ-మోలాసిస్‌ నుంచి తీసిన ఇథనాల్‌ సరఫరా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news