కవిత ఒక్కరే కాదు..కేసీఆర్ కూడా జైలుకు వెళతారు – రాములమ్మ

-

 

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి వాటి పరిధి మేరకు చట్టప్రకారం విచారణ చేస్తున్నాయని అన్నారు విజయశాంతి. అయితే, రాష్ట్రంలో అధికార బీఆరెస్ పాలనలో కొనసాగుతున్న అక్రమ వ్యవహారాలపై కూడా జరుగుతున్న పర్యవేక్షణా కార్యాచరణ ధర్మ విధాన ప్రకారం పూర్తయిన రోజున గులాబీ దళం పునాదులు కదలక తప్పదు, ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు సైతం కోర్టు బోనులో నిలబడక తప్పదని హెచ్చరించారు.

 

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతల భూకబ్జాలు, ధరణి యాప్ అన్యాయాల దుర్మార్గాలు, లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అమ్మకాలు, ఆక్రమణలు, కమిషన్ వ్యవహారాలు కల్లోలం సృష్టిస్తూ దీన్ని నడిపించి, ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ గారినే వేలెత్తి చూపిస్తున్నాయి. గతంలో ఈ సర్కారు ప్రారంభించిన మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ ‘కమిషన్’ కాకతీయగా మీడియాలో మారుమోగిపోగా…. చివరికి నాటి టీఆరెస్ నేతలు సైతం అసంకల్పితంగా ఈ ప్రాజెక్ట్‌ని ‘కమిషన్’ కాకతీయ అంటూ ప్రస్తావించి పలు సభలు, సమావేశాల్లో అభాసుపాలయ్యారన్నారు.

 

 

ఇక కాళేశ్వరం సంగతి చెప్పనక్కర్లేదు. వేల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో ఎక్కడికెళ్లాయో పసిపిల్లల్ని అడిగినా చెబుతారు. ఆ పైన అడుగడుగునా కనిపించే గులాబీ నేతల కబ్జాలు, దారుణాల కింద పేదల ఆక్రందనలు ప్రతి రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. ముందుగా పాలకుడు నీతిగా ఉంటే రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉంటారు… కానీ, అందుకు భిన్నంగా వ్యవహరించడం వల్లే… ఒకప్పుడు తెలంగాణని ధనిక రాష్ట్రంగా అభివర్ణించుకున్న కేసీఆర్ గారి హయాంలోనే ఇది అప్పుల కుప్పల కుంభకోణాల రాష్ట్రంగా మారిపోయింది. ఏది ఏమైనా, “మా అవినీతి ఆర్జన మా కుటుంబ స్వంతం… మాపై కేసులు వస్తే వాటిని తెలంగాణ సమస్యగా తయారు చేస్తాం…” అనేది సరి కాదు. విజ్ఞత కలిగిన తెలంగాణ బిడ్డలు అన్నీ అర్థం చేసుకుంటున్నారనీ చెప్పారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version