BRS కాదు… భవిష్యత్తు రహిత పార్టీ – విజయశాంతి

-

BRS మరోసారి విరుచుకుపడ్డారు విజయశాంతి. భవిష్యత్_రహిత_సమితి నాయకత్వం అధికారం లేకుంటే అసలు బతకలేని స్థితికి చేరుకున్నట్లు కనబడుతోందని చురకలు అంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ఒక వైపు దశలవారీగా చేస్తుండగానే, 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం ప్రచురించారు.

vijayashanthi on ts assembly elections
vijayashanthi on ts assembly elections

బీఆర్ఎస్ వైపు నుంచి అదికూడా దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నెత్తిన 6 లక్షల కోట్లు అప్పు పెట్టిన అంశం వారే సిగ్గులేక యాదిమరిచి అంటూ ఫైర్ అయ్యారు. నిజానికి గత సుమారు 10 ఏండ్ల బీఆర్ఎస్ మోసపు, అసత్యపు, అమలు చేయని హామీలు, అవినీతి, అరాచకాల గురించి, #K_కోతి_C_చేష్టల_R_రాజ్యం (#కేసిఆర్) పరిపాలన గురించి పుస్తకాలు ప్రచురిస్తే అది ఒక గ్రంథాలయానికి చాలచ్చు బహుశా అంటూ మండిపడ్డారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news