ఒక్కో సర్పంచ్ కి రూ.5 లక్షలు బాకీ ఉన్నావు..ఇదేనా బంగారు తెలంగాణ అంటూ విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనలో సర్పంచులు అనేక ఇబ్బందులు పడుతున్నరు. వారికి రావలసిన నిధులను కేసీఆర్ సర్కార్ అస్సలు విడుదల చేయడం లేదని విమర్శించారు.
దాంతో వారు అనేక బాధలు పడుతున్నరు. అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నరు. కానీ ఏడాదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లులు విడుదల చేయట్లేదని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నమని సర్పంచులు వాపోయారన్నారు.
ఒక్కో సర్పంచ్‌కు సగటున రూ.5 లక్షల పైనే బిల్లులు రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు అంచనా. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటం, బిల్లులు రాకపోవడంతో పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నరు. ఏం కేసీఆర్… ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ? ఇప్పటికైనా సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను రిలీజ్ చెయ్. ప్రజా ప్రతినిధులతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి.