కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. గహ్లోత్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి అంశంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్న నేపథ్యంలో సీఎం స్థానంపైనే సచిన్‌పైలట్, సోనియా భేటీ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితికి నైతిక బాధ్యత వహిస్తూ గహ్లోత్ అధ్యక్షపదవి రేసు నుంచి తప్పుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన గహ్లోత్ మద్దతు దారులపై అధిష్ఠానం చర్యలకు ఉపక్రమిచించింది. ముగ్గురు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదతో పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ కేంద్ర పరిశీలకులు మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌ల నివేదిక అధిష్ఠానానికి చేరిన తర్వాత ఈ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.