కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు..వారి అంతు చూస్తాడని తెలిపారు బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. మా ఎమ్మెల్యేలు పార్టీ మారడం దురదృష్టకరమని… ఎన్నికల సమయానికి వాళ్ళు మళ్ళీ మా పార్టీ లోకి వచ్చినా… వారిని ప్రజలు ఆదరించరని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీ కి వస్తారు…రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. కేంద్రంలో ఈసారి బీజేపీ కి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదని… ఎన్డీయే కూటమి లో ఉన్న టీడీపీ భాగస్వామ్యం తో ప్రభుత్వం ఏర్పాటు అయిందని వివరించారు.
చంద్రబాబు నాయుడు ఈ మద్య కేంద్ర పెద్దలను కలిసి కొన్ని విన్నపాలు చేశాడు….షెడ్యూల్ 13 లో ఉన్న అంశాలను ఆరు నెలల్లో పూర్తి చేయాలని హెచ్చరించారు అని వార్తలు వచ్చాయని వెల్లడించారు. ఏపీ కి 65 వేల కోట్ల ఆయిల్ రిఫైనరీ సంస్థలు ఇస్తాం అని కేంద్రం హామీ ఇచ్చింది అని ప్రచారం జరుగుతోందన్నారు. అదే షెడ్యూల్ 13 లో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వట్లేదని ఆగ్రహించారు. ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్ ప్రజలు నలభై ఏళ్ళు గా కొట్లాడుతున్నారన్నారు బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్.