హై కోర్టులో నందిగం సురేష్ పిటిషన్.. సోమవారం విచారణ..!

-

గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై జగన్ ప్రభుత్వ హయాంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పలువురు వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. దీంతో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

2021 అక్టోబర్ 21న మంగగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి 56 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఆరవ సత్యం, అంబేద్కర్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ముందుస్తు బెయిల్ కోసం వారంతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 16 వరకు వారిని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే కేసులో అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news