హైదరాబాద్ లో వివింట్‌ ఫార్మా కంపెనీ రూ.400 కోట్ల పెట్టుబడులు

-

పెట్టుబడుల వేట లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. తాజాగా ‘వివింట్‌’ ఫార్మా కంపెనీ హైదరాబాద్ నగరంలో రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీతో దాదాపు 1,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ఇప్పటికే జీనోమ్‌ వ్యాలీలో వివింట్ సుమారు రూ.70 కోట్లతో ‘పరిశోధన, అభివృద్ధి కేంద్రం’ ఏర్పాటు చేసింది. దీని విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో రూ.400 కోట్లతో తన మొదటి తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. పరిశోధన, ఆవిష్కరణ కేంద్రంతో పాటు తయారీ యూనిట్, మౌలిక సదుపాయాల కల్పనకు జీనోమ్‌ వ్యాలీలో 5.5 ఎకరాలు కొనుగోలు చేసింది. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news