రూ.2.95లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌!

-

తెలంగాణ సర్కార్ శాసనసభలో ఇవాళ ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్‌లో ఉన్నా.. ఏడాది మొత్తానికి అంచనాలు ప్రకటించనున్నారు.

వచ్చే ఏడాది (2024-25)కి బడ్జెట్‌ అంచనా రూ.2.95 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకూ ఉండే అవకాశాలున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాల ప్రకారం  అత్యధికంగా సంక్షేమ రంగానికి రూ.40 వేల కోట్లు, వ్యవసాయానికి రూ.30 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.30 వేల కోట్లు, సాగునీటి పారుదలకు రూ.29 వేల కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.18 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం.

గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో అంటే ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు పన్నుల ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదు.  మరోవైపు, గత బడ్జెట్‌లో కేంద్రం నుంచి రూ.41,259 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పటివరకూ అందులో 15 శాతమే వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలా పన్నుల ఆదాయం ఆశించిన విధంగా రాకపోవడం, కేంద్రం గ్రాంట్లు తక్కువగా రావడం వంటి కారణాల వల్ల సవరించిన బడ్జెట్‌ అంచనాలు రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.2.50 లక్షల కోట్లకు తగ్గవచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news