BSP అభ్యర్థుల నాలుగో జాబితా..లిస్ట్ ఇదే

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం BSP 13 మందితో 4వ లిస్ట్ విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్ఎస్ తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమైన బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం రాత్రి మరో 13 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేశారని ప్రకటన విడుదల చేసింది బీఎస్పీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీఎస్పీ 87 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో బీఎస్పీ పోటీ చేసే మొత్తం స్థానాలు 100 చేరాయి. మిగిలిన 19 స్థానాలకు చివరి జాబితాతో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

BSP released 4th list with 13 candidates for assembly elections

నాలుగవ విడత జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులు..

1. ముధోల్ – సర్దార్ వినోద్ కుమార్
2. నిజామాబాద్ (అర్బన్)- షేక్ ఇమ్రాన్ ఖాన్ (ఫిరోజ్)
3. మంథని – చల్లా నారాయణ రెడ్డి
4. మెదక్ – అంసల్ పల్లి లక్ష్మి
5. సంగారెడ్డి – క్యాసారం ప్రవీణ్ కుమార్ యాదవ్ (రివైజ్డ్)
6. కూకట్ పల్లి – బండరిగల్ల సంజీవరావు
7. ఖైరతాబాద్ – మిద్దె కృష్ణ
8. చార్మినార్- అబ్రహార్ హుస్సేన్ ఆజాద్
9. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ)- బూడిద కరుణాకర్
10. గద్వాల్ – అయితికూర్ రెహ్మాన్
11. అలంపూర్ (ఎస్సీ)- ప్రసన్నకుమార్ (రివైజ్డ్)
12. నల్గొండ – డా.కోమటి సాయితేజ రెడ్డి
13. వరంగల్ (వెస్ట్) – మాదారపు రవికుమార్

Read more RELATED
Recommended to you

Latest news