బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. దీంతో బీఆర్‌ఎస్ ఎంపీ పసునూరి దయాకర్…కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. మరి బీఆర్‌ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇక అటు సీఎం రేవంత్ రెడ్డి తో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాదులో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆయన మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు సమావేశమై చర్చలు సైతం జరిపినట్లు తెలుస్తోంది తాజాగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది.