సీతారామ ఫామ్ హౌస్ 2 లో ట్రయల్ రన్ విజయవంతం

-

Successful trial run in Sitarama Farm House 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభవార్త. సీతారామ ఫామ్ హౌస్ 2 లో ట్రయల్ రన్ విజయవంతం అయింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగుడంలోని వి.కే రామవరం వద్ద సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ పేస్ 2 విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తయింది. ఈ మేరకు గోదావరి జలాలు దిగువకు విడుదల చేశారు అధికారులు.

Successful trial run in Sitarama Farm House 2

బాహుబలి మోటర్లు ఆరు ఉండగా ఒక మోటర్ తో పదిహేను వందల క్యూసెక్కుల నీటిని ట్రయల్ ద్వారా దిగువకు విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. ట్రయల్ రన్ కోసం గత పది రోజులుగా అవిశ్రాంతిగా పనిచేసింది ఒక జపాన్ టెక్నీషియన్ తో పాటు చైనా అనుబంధ టెక్నీషియన్ల బృందం.. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇరిగేషన్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news