Water tanker driver assaulted at Ayyappa society: దారిలో అడ్డంగా ఉందని వాటర్ ట్యాంకర్ డ్రైవర్ తల పగలగొట్టారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మనుషులు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న CGR స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుండగా తమ వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబందించిన

కొందరు యువకులు తన తల పగిలేలా కొట్టారని బాధితుడు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సయ్యద్ సలీం ఆరోపించాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. సీఎం సోదరుడు కాబట్టి ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితుడు సయ్యద్ సలీం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.