తెలంగాణలోని వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అత్యంత త్వరలోనే కొత్త వాహన స్క్రాప్ పాలసీని తీసుకు వస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సారధి వాహన్ అనే పోర్టల్ లో 28 రాష్టాలు ఇందులో జాయిన్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు జాయిన్ కాలేదు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
ఈరోజు నుంచి సారధి వాహన్ పోర్టల్ లో జాయిన్ అవుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త వాహన స్క్రాప్ పాలసీని తీసుకు వస్తున్నామని తెలిపారు. వాహన యజమాని గడువు ముగిసిన వాహనాలకు సొంతంగా తుక్కు వేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. రోడ్డు భద్రతా పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘించిన 8 వేల మంది లైసెన్స్ రద్దు చేసామని తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలు తప్పకుండా రాష్ట్రంలో అమలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.