ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించాం : మంత్రి కోమటిరెడ్డి

-

తెలంగాణలో రోడ్ల పరిస్థితి దారుణంగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రోడ్ల భవనాలు అండ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. చిట్యాల బస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ బ్రిడ్జీ నిర్మాణ పనులకు ఇవాళ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి  శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడతూ.. నకిరేకల్ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లతో పాటు గ్రామాలకు కలిపే లింక్ రోడ్లను సైతం అభివృద్ధి చేస్తానని తెలిపారు. 

నేషనల్ హైవే 65పై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 17 బ్లాక్ స్పాట్ల వద్ద తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చిట్యాల వద్ద రూ.40 కోట్లతో ఫ్లైఓవర్ పనులు చేపట్టామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. రూ.30వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news