NEET పేపర్ లీక్ ఇష్యూలో కీలక పరిణామం.. రంగంలోకి సీబీఐ..!

-

దేశంలో సంచలనం రేపుతోన్న నీట్- యూజీ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్, గ్రేస్ మార్కుల కేటాయింపు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. నీట్ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే.

సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశంతో నీట్ ఇష్యూను నిగ్గు తేల్చేందుకు తాజాగా సీబీఐ ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బీహార్ లో జరిగిన నీట్ పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కలపై కేటాయింపుపై సీబీఐ ఎంక్వెరీ చేయనుంది. నీట్ యూజీ ఎగ్జామ్ ఇష్యూలో వస్తోన్న అన్నీ ఆరోపణలపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. సీబీఐ ఎంట్రీతో ఈ కేసులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news