పెద్దపల్లి ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు. రైతు బంధు కావాలా వద్దా అని అడిగారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది. కాంగ్రెస్ రైతుబంధు దుబారా అంటున్నారు. కాంగ్రెస్ ధరణీ తీసేసి బంగాళఖాతంలో వేస్తామంటున్నారు. ప్రజలు గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల సాధించుకోవడం కోసం అన్నారు. వ్యవసాయం చేయని రాహుల్ గాంధీ కూడా ధరణిని తీసేస్తామంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దళారుల వ్యవస్థ వస్తుందన్నారు సీఎం కేసీఆర్.
రైతుల బాధ శాశ్వతంగా పోవాలని ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. దరఖాస్తు లేదు.. దప్తర్ లేదు ఏది లేకున్నా రైతులకు న్యాయం జరుగుతుంది. మీ భూమి మీద పెత్తనం మీకు ఇచ్చినం. అధికారం మీ దగ్గరే ఉండాలా..? వద్దా..? దీనిపై గ్రామాలలో చర్చ పెట్టాలి. అన్నీ ఆలోచించి ఓటు వేయాలని కోరారు సీఎం కేసీఆర్. పేదల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ వైఖరీ, ప్రభుత్వాల వైఖరీ గురించి ఆలోచించి ఓటు వేయాలని అభ్యర్థించారు కేసీఆర్.