బూతులు తిట్టినా అలాగే చేస్తాం.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నిన్న చివరి రోజు ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదురుతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెన్షేషనల్ ట్వీట్ చేశారు.

పోరాటం తమకు కొత్త కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరం అయితే ఢిల్లీకి వెళ్లి ఎండగడతామన్నారు. వదిలి పెట్టేదే లేదన్నారు. మీరు బూతులు తిట్టినా.. అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటామని, నిలదీస్తూనే ఉంటామన్నారు. గతంలో కూడా దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమ సమయంలో పలువురిని బూతులు తిట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగ్గారెడ్డి కూడా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version