ట్విటర్​ ట్రెండింగ్​లో మంత్రి హరీశ్ రావు

-

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తాజాగా రాష్ట్ర మంత్రి హరీశ్ రావుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది హరీశ్ రావుకు నెగిటివిటీ ఎంత తీసుకువచ్చిందో కానీ.. సింపతీ మాత్రం బాగా కలిసొచ్చింది. ఒక్కసారిగా నెట్టింట హరీశ్ రావుకు మద్దతు పెరిగిపోయింది. ఎంతలా అంటే ట్విటర్​ ట్రెండింగ్ టాప్​లో హరీశ్ రావు ఉండే అంత.

సోషల్‌ మీడియా వేదికగా పార్టీలకు అతీతంగా మంత్రి హరీశ్ రావుకు మద్దతు పెరుగుతోంది. మైనంపల్లికి వ్యతిరేకంగా, హరీశ్‌కు మద్దతుగా నెటిజన్లు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నారు. ట్విటర్​లో ‘వి ఆర్ విత్ హరీశ్ అన్నా’ #WeAreWithHarishAnna హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌ టాప్‌లోకి వచ్చింది. ఎమ్మెల్యే హనుమంతరావును కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్లు, రీట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

తనతోపాటు తన కొడుకు రోహిత్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని మైనంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి హరీశ్ రావు అడ్డుపడుతున్నారని, ఆయన అంతు చూస్తానని మైనంపల్లి వ్యాఖ్యానించారు. అయితే మైనంపల్లికి మళ్లీ టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ ఆయన కొడుక్కు మాత్రం నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version