గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తడిసి ముద్దవుతో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ మరియు రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. నిజామాబాద్ జగిత్యాల నిర్మల్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఏవిధంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు అంచనా వేస్తోంది.
అలాగే కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్య అవకాశంలో ఉన్నాయని చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంపై ఉన్న మేఘాల ఉధృతి నమూనాను పరిశీలించి ఈ మేరకు అంజన వేసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.