సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలిస్తే.. కేంద్రంలో ఆ పార్టీదే అధికారం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సికింద్రాబాద్ లో దానం నాగేందర్ నామినేషన్ కు ర్యాలీగా రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సికింద్రాబాద్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డిలు కేంద్ర మంత్రులు అయ్యారు. అంజన్ కుమార్ యాదవ్ కి కూడా మంత్రి పదవీ ఇవ్వాలనుకున్న కాంగ్రెస్ పార్టీలో అకస్మాత్తుగా వై.ఎస్. మరణించడం వల్ల ఇవ్వలేకపోయారని తెలిపారు.
మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీనే. దానం నాగేందర్ కి ఢిల్లీలో పెద్ద పదవీ ఇప్పించే బాధ్యత నాదే అన్నారు. పద్మారావు మంచోడే.. కానీ ఆయన గురువు మంచోడు కాదు. పద్మారావును ఓడించి.. కిషన్ రెడ్డిని గెలిపించేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారు. సికింద్రాబాద్ లో బీజేపీని ఓడించాలంటే దానం నాగేందర్ కి ఓటు వేయాలి. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే దానం గెలవాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు.