హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎవరు.. నార్త్ అధికారులకే అవకాశాలుంటాయని ప్రచారం?

-

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఖాళీ అయిన 20 పోలీస్‌ పోస్టుల్లో ఎవర్ని నియమిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్​గా ఎవరు నియామకమవుతారనే విషయం చర్చనీయాంశమవుతోంది. ఈ పోస్టుకు ముగ్గురు పేర్లను సూచించాలని ఈసీ కోరింది. హైరాబాద్‌ సీపీ సహా కమిషనర్ల పోస్టుకు రాష్ట్రంలో పనిచేస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారుల పేర్లన్నీ పంపాలని కోరినట్లు సమాచారం. సీపీలతో పాటు ఖాళీ అయిన మిగతా పోస్టులకు సంబంధించి.. సీఎస్‌ శాంతికుమారి మొత్తం 17 మందితో కూడిన అదనపు డీజీ స్థాయి అధికారుల జాబితాను పంపినట్లు తెలిసింది. వారిలో ముగ్గురి జాబితాను వేరుగా పంపినట్లు సమాచారం.

సందీప్‌శాండిల్య, సంజయ్‌కుమార్‌ జైన్‌, శ్రీనివాసరెడ్డి? ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారినే హైదరాబాద్‌ సీపీగా నియమించేందుకు ఎన్నికల కమిషన్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలా అయితే తెలంగాణ పోలీసు అకాడమీ సంచాలకులుగా పనిచేస్తున్న సందీప్‌శాండిల్య, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌లకు అవకాశం ఉండే వీలుంది. లేదా అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగుతున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మహేష్‌భగవత్‌కు అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరిగినా.. మునుగోడు ఎన్నికలప్పుడు ఆయన రాచకొండ కమిషనర్‌గా ఉండటం, చౌటుప్పల్‌ ప్రాంతం మునుగోడు నియోజకవర్గం పరిధిలోకి రావడం ఆటంకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news