జమిలి ఎన్నికలపై ఎందుకు భయం అని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు అని ప్రచారం జరగగానే ఎందుకు అభద్రతా బావం, ఎందుగు గుబులు చెందుతున్నారు. మూడు సార్లు భేటీ అయ్యారు.. విధానం చెప్పలేదు, లీడర్ ఎవరో చెప్పలేదు అన్నారు. మోడీ కి రాహుల్ కి మధ్య తేడా నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇంకా జమీలి పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి రిపోర్ట్ రావడానికి 6 నెలల సమయం పడుతుంది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఉలికిపడుతున్నాడని పేర్కొన్నారు. ఉత్తరాది,దక్షిణాది అని అభద్రతా భావన తో రేవంత్ మాట్లాడుతున్నారు. జమిలి ఎన్నికల కమిటీ లో అధిరంజన్ చౌదరి కి అవకాశం ఇస్తే ఉండనని పేర్కొన్నారు. కలుపు కుంటే ఉండమని.. కలపక పోతే మమ్మల్ని విస్మరించారు అని దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారు. 2018 లో BRS జమిలి ఎన్నికలకు అనుకూలం అని చెప్పింది. ఇప్పుడు ఆ పార్టీ నేత వినోద్ పార్టీ లో చర్చిస్తునమని చెబుతున్నారు. చారిత్రాత్మక సమావేశాలు కాబోతున్నాయి. దేశ ప్రజలకి మేలు జరిగే విధంగా నిర్ణయాలు ఉంటాయి అని తెలిపారు.