రాజేంద్రనగర్ లో భార్య న్యాయపోరాటంకు దిగింది. అవిటి కొడుకును కన్నావంటూ భార్యను, కొడుకును దూరం పెట్టాడ భర్త. దీంతో హైదర్ గూడలో భర్త ఇంటి ముందు కొడుకుతో కలసి ఆందోళన చేస్తున్నారు భార్య అలేఖ్య. ఈ సంఘటనపై నిన్న పెళ్లిరోజు కావడంతో ఉదయ్ భాస్కర్ ను కలువడానికి ఇంటికి వచ్చానని తెలిపారు అలేఖ్య. నిన్నటి నుండి ఉదయ్‌ని కలవడానికి ప్రయత్నం చేస్తున్న, కానీ ఇప్పటివరకు కలవలేదని భర్తపై ఫైర్ అయింది.
పైగా నన్ను ఇంట్లోకి రానీయకుండా తలుపులు తలుపులు పెట్టి తాళం వేశారన్నారు. 2014 లో ఉదయ్ తో పెళ్లి జరిగింది 2017 లో బాబు పుట్టాడు…బాబు అంగవైకల్యంగా పుట్టడంతో అప్పటినుండి నన్ను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు అలేఖ్య. బాబును వదిలేసి ఇంట్లోకి రమ్మని చెప్తున్నారని… అంగవైకల్యంతో పుట్టిన బాబుని ఎలా వదిలేయాలని ప్రశ్నించారు.
సుమారు ఏడేళ్లుగా నా కొడుకును నన్ను ఇంట్లోకి రానిస్తారని ఎదురుచూస్తున్నాను… కానీ ఇప్పటివరకు మా అత్తమామతో పాటు భర్త లో మార్పు రావడం లేదని పేర్కొన్నారు అలేఖ్య. నా కొడుకు ఎందుకు గతి లేని వాడిలా బయట ఉండాలి… నాకు నా కొడుకు న్యాయం జరగాలని కోర్టులో కేసు కూడా వేశానన్నారు అలేఖ్య.