పిల్ల‌ల కోసం 20బెడ్లే కేటాయిస్తారా?.. ప్ర‌భుత్వంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

-

ప్ర‌స్తుతం దేశంలో సెకండ్ వేవ్ ఎంత‌లా ప్ర‌భావం చూపుతుందో చూస్తూనే ఉన్నాం. దీని వ‌ల్ల దేశంలో అన్ని రాష్ట్రాలు కుదేల‌య్యాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మిగ‌తా రాష్ట్రాల కంటే తెలంగాణ‌లో క‌రోనా కేసులు కాస్త త‌క్కువ‌గ ఉన్న‌ప్ప‌టికీ.. ఇక్క‌డ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై హైకోర్టు ఎన్నోసార్లు అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

ఇప్పుడు తాజాగా థర్డ్ వేవ్ జనాన్ని భయపెడుతుంది. ఈ థ‌ర్డ్‌ వేవ్ లో ప్రధానంగా పిల్లలపై ఎఫెక్ట్ చూపుతుంద‌ని అంతా భ‌య‌ప‌డుతున్నారు. ఈ క్రమంలో అన్నిరాష్ట్రాల ప్ర‌భుత్వాలు పిల్లల కోసం వైద్య సదుపాయాలు పెంచుతున్నాయి. వారికోసం ప్ర‌త్యేకంగా ఐసీయూ బెడ్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.

అయితే తెలంగాణ‌లో మాత్రం కేవలం 20 బెడ్స్ మాత్రమే ఉన్నాయంటూ సీనియర్ లాయర్ రవిచందర్ హైకోర్టుకు వివ‌రించారు. ఈ 20 బెడ్లు కూడా కేవలం నీలోఫర్ ఆసుపత్రిలో మాత్రమే ఉన్నాయని చెప్ప‌డంతో హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మహారాష్ట్రలో చిన్న పిల్లల కోసం ఎనిమిది వేల బెడ్స్ రెడీ చేస్తే మ‌న రాష్ట్రంలో ఇంత త‌క్కువ‌గా చేయ‌డ‌మేంటని ప్ర‌శ్నించింది. బెడ్ల సంఖ్య‌ను వెంట‌నే పెంచాలంటూ ఆర్డ‌ర్ వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version