ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఎలాంటి పనులు చేయలేం. కానీ ఆధార్‌లో మన పేరు, బర్త్‌డేట్, ఇతర విషయాలు కొన్నిసార్లు తప్పుగా వస్తుంటాయి. ఇలాంటి మిస్టేక్‌లను కరెక్ట్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు UIDAI ఇప్పుడు సులభతరం చేసింది. మొబైల్ ఫోన్ నుంచి ఇంట్లో కూర్చొని కూడా ఈ పని చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డులో అడ్రస్‌ను ఎలా మార్చాలి?
ఆధార్‌లో అడ్రస్‌ను మార్చడానికి, resident.uidai.gov in వెబ్ సైట్ లో ఆధార్ అప్‌డేట్ విభాగంలో ఇచ్చిన ‘రిక్వెస్ట్ ఆధార్ కన్ఫర్మ్ లెటర్’ పై క్లిక్ చేయండి. దీని తరువాత సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (ఎస్‌ఎస్‌యుపి) ఓపెన్ అవుతుంది. ఇక్కడ 12 అంకెల ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. SMS ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లింక్ వస్తుంది.
OTP ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి కన్ఫర్మ్ చేయాలి. దీని తరువాత మీరు UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి ‘ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్’ పై క్లిక్ చేయాలి. అలాగే సీక్రెట్ కోడ్ ద్వారా అడ్రస్ అప్‌డేట్‌ను ఎంచుకోవాలి.
సీక్రెట్ కోడ్’ ఎంటర్ చేసిన తరువాత, కొత్త అడ్రస్ ఎంటర్ చేసి, సబ్‌మిట్ పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త అడ్రస్ అప్‌డేట్ అవుతుంది.
ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చుకోవాలి?
దీని కోసం మొదట ssup.uidai.gov.in కు వెళ్లండి. ఇక్కడ మీకు ప్రొసీడ్ ఆప్షన్ అప్‌డేట్ ఆప్షన్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. దీని తరువాత మీకు పేజీ ఎపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ 12 అంకెల ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తరువాత క్యాప్చాను నింపి, సెండ్ OTP పై క్లిక్ చేయండి, మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో నేమ్ అప్‌డేట్ ఆప్షన్ పై క్లిక్ చేసి పాన్ కార్డ్, డిఎల్, ఓటరు ఐడీ లేదా రేషన్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా అప్‌లోడ్ చేయాలి. అన్ని వివరాలను ఇచ్చిన తరువాత మీ నంబర్‌కి వచ్చిన OTP ని ఎంటర్ చేస్తే పేరు మారుతుంది. వీటిలాగే బర్త్ డేట్ ను కూడా మార్చుకోవచ్చు.