చంచల్ గూడ జైలులో జర్నలిస్ట్ రేవతి, తన్వీ యాదవ్ తో ములాఖాత్ అయ్యారు కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. భార్య పిల్లలను దూషించారని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. మరి మిగతా వారికి భార్య పిల్లలు లేరా? నువ్వు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, మా మైనర్ పిల్లలను అన్నప్పుడు, అందరికి అక్రమసంబంధాలు అంటగట్టినప్పుడు.. ఆరోజు మాకు కుటుంబాలు ఉంటాయని సోయి లేదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని, వ్యతిరేకతను చెప్తే జర్నలిస్టులను అక్రమ అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గౌతమ్ గౌడ్, ఆకుల శ్రీనివాస్ రెడ్డి, శంకర్ గౌడ్, రంజిత్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, సరిత యాదవ్, విజయారెడ్డి, రేవతి, తన్వీ యాదవ్, శివారెడ్డి ఇలా ఇంత మంది జర్నలిస్టులను అక్రమ అరెస్ట్ చేశారని తెలిపారు.