మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభలో పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయనను ఆశీర్వదించాలని కోరారు. త్వరలోనే లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామన్నారు. ఇక తాను సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకున్నావా..? అని అడిగారు. కడుపు నొచ్చినా, కాలు నొచ్చినా.. పగలైనా.. రాత్రి అయినా జోష్ తో పని చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా, మోడీ పదేళ్లు పీఎంగా ఉండవచ్చు. పేదోళ్లు ప్రభుత్వం వస్తే.. 6 నెలలు కూడా ఉండనివ్వరా..? పాలమూరు బిడ్డ సీఎం కుర్చీపై కూర్చుంటే ఓర్వలేకపోతున్నారా..? ఎవ్వడైనా మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పాలమూరు బిడ్డలు మానవ బాంబులు అవుతారు. తొక్కి పేగులు తీసి మెడలో వేసుకుంటాం బిడ్డా అని హెచ్చరించారు.