ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో RMP వైద్యం వికటించి మహిళ మరణించింది. గత వారం రోజులుగా RMP వద్ద జ్వరానికి చికిత్స పొందుతుంది లంకపల్లి గ్రామానికి చెందిన రాయల లక్ష్మీ అనే 32 ఏళ్ళ మహిళా. జ్వరం తగ్గిన తరువాత కూడా నిరసంగా ఉండటంతో మరోసారి RMPని సంప్రదించింది లక్ష్మీ. దాంతో RMP సైలేన్ పెట్టాడు. కానీ అదే సమయంలో వణుకు రావటంతో సైలేన్ ఆపి ఇంజక్షన్ ఇవ్వటంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది బాధిత మహిళ లక్ష్మీ.
పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి ఆపై హైదరాబాదు తరలిస్తుండగా లక్ష్మీ మరణించింది. అయితే లంకపల్లి లో ఓ మెడికల్ షాపు నిర్వహిస్తూ వచ్చి రాని వైద్యం చేస్తున్నడని RMPపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక మహిళా మృతి తర్వాత మెడికల్ షాపు మూసేసి పరారయ్యాడు RMP వైద్యుడు. అయితే గడిచిన పది రోజులలో జ్వరాలు ఇతర వ్యాధులతో 10 మృతి చెందడంతో ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు.