చేనేత కార్మికుల ఉపాధి పెంపునకు కృషి చేస్తా : మంత్రి తుమ్మల

-

రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఉపాధి పెంపునకు కృషి చేయాలని సంబంధిత శాఖ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు.మంగళవారం సచివాలయంలో చేనేత, జౌళి శాఖలపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.ఇందులో ఆయా శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఇప్పటివరకు టీజీసీవో నుంచి వచ్చిన ఆర్డర్లు, వాటి పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ శాఖలకు,కార్పొరేషన్లకు,ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. 2025-26 ఏడాదికి అవసరమగు వస్త్ర ఇండెంట్‌ను టెస్కో వారికి నవంబర్ 15, 2024లోగా సమర్పించాలన్నారు.ఇక చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించేలా అధికారులు కృషి చేయాలని తుమ్మల చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news