తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వడగళ్ల వాన కూరిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ ను హైదరాబాద్ వాతావణ కేంద్ర జారీ చేసింది. దక్షిణ, తూర్పు దిశల నుంచి బలమైన గాలులు వస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ బలమైన గాలుల ప్రభావంతో హైదరాబాద్ తో పాటు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపుల తో కూడాన వడగళ్ల వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రజలు జాగ్రత్త గా ఉండాలని సూచించింది. ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. అయితే ప్రస్తుతం కూడా పొడి వాతావరణం ఉంది. దీంతో చలి కూడా కాస్త తగ్గింది. మూడు రోజుల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉండటంతో ఈ మూడు రోజులు చలి కూడా కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇదీల ఉండగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి.