తెలంగాణలో వరుసగా సెలవులు వచ్చాయి. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం, మంగళవారం (సెప్టెంబర్ 17)న వినాయకుల నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక సుదూర ప్రాంతాల నుంచి నగరంలోని ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం చూసేందుకు చాలా మంది ప్రజలు నగరానికి తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే జంటనగరాల్లో అధికారులు ప్రత్యేకంగా నిమజ్జానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక సెప్టెంబర్ 17న మంగళవారం జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ జీవో విడుదల చేసింది. ఇక ఆ రోజున సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9న రెండో శనివారంను వర్కింగ్ డేగా ప్రకటించింది. అయితే, అక్టోబర్‌లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.