కులంపేరుతో ప్రేయసి కుటుంబం దూషణ.. అవమాన భారంతో యువకుడి ఆత్మహత్య

-

కులం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నవాళ్లకు గుండె కోత మిగిల్చింది. ప్రేమించిన యువతి కుటుంబం కులదూషణ చేయడం, దాడికి తెగబడటంతో అవమానంగా భావించిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో చోటుచేసుకుంది.

కూకట్‌పల్లి షంషీగూడ పరిధి మహంకాళీనగర్‌కు చెందిన కాకి సునీల్‌(22) తన ఇంటి సమీపంలో ఉండే యువతి(21) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు సునీల్ను హెచ్చరించారు. అయినా ఈ ఇద్దరు కలిసి తిరగడంతో యువతి సోదరుడు సోమవారం సాయంత్రం సునీల్పై దాడికి దిగాడు. మళ్లీ అదే రోజు రాత్రి యువతిని తీసుకుని ఆమె సోదరులు, తల్లి సునీల్ ఇంటికి వెళ్లి దుర్భాషలాడారు. కులం పేరుతో దూషించి దాడికి దిగడంతో స్థానికులు అడ్డుకున్నారు.

అనంతరం పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే పోలీసులు మరుసటి రోజు మాట్లాడదామని వారిని ఇంటికి పంపగా.. సునీల్ మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన చావుకు యువతి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని తన ఇంట్లో వాళ్లుక మెసేజ్లు పంపాడు. ఈ ఘటనపై యువతి, ఆమె తల్లి, సోదరులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news