కూకట్‌పల్లి ట్రాఫిక్ లో డబ్బులు గాల్లోకి విసుతురు యూట్యూబర్ హల్చల్..!

-

కూకట్‌పల్లిలో ఓ యూట్యూబర్ హల్చల్ చేసాడు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వ్యూస్ కోసం చాలా మంది చాలా రకరకాలైన ఆలోచనలతో వస్తున్నారు. అందులో కొందరు డబ్బులను పంచుతుంటే.. ట్రాఫిక్ మధ్యలో నిలబడి డబ్బును గాల్లోకి విసిరాడు హర్ష అనే యూట్యూబర్. అయితే ఇప్పటికే అనేకసార్లు ట్రాఫిక్ లో డబ్బులు గాల్లోకి చల్లుతూ రీల్స్ చేసాడు సదరు యువకుడు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్ పై స్టాంట్లు చేస్తు వీడియోలు పెడుతుంటాడు హర్ష.

అయితే తాను విసిరిన డబ్బులను పట్టుకోవడానికి ప్రజలు రోడ్లపైకి పరిగెత్తుతూ వచ్చారు. అయితే యన్టీ వీడియోలనే సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటాడు పవర్ హర్ష అలియాస్ మహాదేవ్. యూట్యూబ్ లో “its_me_power” పేరుతో అకౌంట్ నడుపుతున్నాడు హర్ష. అయితే ట్రాఫిక్ కు అంతరాయాన్ని కలిగిస్తూ ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నేటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news