గుంటూరు జిల్లా 5 పాయింట్స్ లో ఇసుక లభ్యత ఉంది. ఎక్కువ ఇసుక అందుబాటు లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం అని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఉచిత ఇసుక విధానం లో కొన్ని సమస్యలు గుర్తించాం… వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. స్టాక్ పాయింట్ ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం. అలాగే ఇక పై ఆన్లైన్ లో ఇసుక బుకింగ్స్ ఉండవు అని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో 3 రెవెన్యూ కార్యాలయాల వద్ద ఇసుక బుకింగ్ లు జరుగుతాయి.
గుంటూరు, తుళ్ళూరు, తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయాల్లో ఇసుక బుకింగ్ లు జరుగుతాయి. ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలు, జిల్లా కమిటీ దగ్గర తమ డేటా నమోదు చేపించాలి. అలాగే ఇసుక రవాణా చేసే వాహన యజమానులు, ఖచ్చితంగా నిభందనలు పాటించాలి. ఇసుక రవాణా వాహనాలను GPS విధానంతో అనుసంధానం చేస్తాం. ఇసుక అక్రమ రవాణా చేసినా, అక్రమంగా అమ్ముకున్నా, జీవో 43 ప్రకారం చర్యలు ఉంటాయి అని కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు.