తెలంగాణ వైయస్సార్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ను పోలీసులు అరెస్టు చేశారు. సినిమా లెవెల్ లో కారుతో పాటు ఆమెను ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఆమె వాహనానికి గొలుసులు తలగిలించి మరి.. పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆమె వాహనం దిగడానికి నిరాకరించడంతో… ఈ విధంగా పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అయితే ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరినప్పటికీ ఆమె వాహనo దిగేందుకు నిరాకరిస్తూనే ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.