ముందస్తుపై డౌటే..కేసీఆర్ పరుగులు అందుకే.!

-

తెలంగాణలో కేసీఆర్ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలులో స్పీడ్ పెంచారు. కొత్త పథకాలు తీసుకురావడానికి చూస్తున్నారు. మరో వైపు స్పీడుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఫాంహౌస్,ప్రగతి భవన్‌లకే పరిమితమైన కేసీఆర్..ఇప్పుడు జనంలోకి రావడం మొదలుపెట్టారు. భారీ సభలతో జనంలోకి వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలు అన్నీ చూస్తుంటే..కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసమే వెళుతున్నారని అర్ధమవుతుంది.

 

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని అనుమానిస్తున్నాయి. తాజాగా కూడా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ముందస్తు ఎన్నికలు వస్తాయని, కర్ణాటకతో పాటే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకముందు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇటీవల జీవన్ రెడ్డి సైతం ముందస్తుపై మాట్లాడారు. కానీ టీఆర్ఎస్ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని, పూర్తి సమయం పాలిస్తామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, బీజేపీలో జ్యోతిష్యులు చెప్పినట్లు జరగదని మంత్రి హరీష్ రావు అన్నారు.

అయితే టీఆర్ఎస్ పైకి ముందస్తు ఎన్నికలు లేవని ఎంత చెప్పిన నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎట్టి పరిస్తుతుల్లోనైనా ప్రతిపక్షాలని ఏమార్చి కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మార్చి లోపు అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేయాలని చూస్తున్నారు. కొత్త సచివాలయం జనవరిలో ప్రారంభమయ్యేలా చూసుకుంటున్నారు.  హైదరాబాద్‌ రూపు రేఖల్ని దాదాపుగా మార్చేశారు. 17 ఫ్లైఓవర్లు నగరం నలుదిక్కూలా ప్రారంభించగా, ఇంకా  ప్రారంభించాల్సినవి ఉన్నాయి. కొత్తగా మెట్రోరైలు విస్తరణకు శంకుస్థాపన చేస్తున్నారు.

అటు సంక్షేమ పథకాల్లో జోరు పెంచారు..మరోవైపు నిరుద్యోగులని సంతృప్తి పరిచేలా జాబ్ నోటిఫికేషన్లు వదులుతున్నారు. డిసెంబర్‌ మొదటి వారం నుంచి సీఎం జిల్లాల పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా జరుగుతాయి. ఇక ఎటు చూసుకున్న మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని అంతా డౌట్ పడుతున్నారు. మరి కేసీఆర్ ముందస్తు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version